విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని కోట వీధి ఈద్ గాహ్ వద్ద బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి సోమవారం సాముహిక నమాజ్ లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. త్యాగం, సహనం ఈ పండుగ ద్వారా అందించే మంచి సందేశమని అన్నారు. ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించు కుంటూ భక్తి శ్రద్ధలతో పండుగ ఆనందంగా జరుపుకుంటారన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ వుండాలని ఆకాంక్షించారు