టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. బుధవారం వాహనం విశాఖ చేరుకుంది. తొలిసారిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పల్లా శ్రీనివాసరావు ప్రయాణించారు. శ్రీనివాసరావుకు భద్రత కూడా పెంచారు.