బిడ్డ కోసం ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా

85చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణి మంగళవారం విశాఖ కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరింది. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు.దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకొని ఆమె వెంట వెళ్లారు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. సిబ్బందిపై బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్