విశాఖ - విజయనగరం సరిహద్దు భోగాపురం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖకు కారులో వెళ్తుండగా ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారుగా ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.