రేపు జిల్లా స్థాయిలో గురుపూజోత్సవం

85చూసినవారు
రేపు జిల్లా స్థాయిలో గురుపూజోత్సవం
విశాఖపట్నం, సెప్టెంబర్ 04: డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం కలెక్టరేట్ లో తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న వెంకోజీపాలెం వద్ద గల సిఎంఆర్ ఫంక్షన్ హాలు వేదికగా వేడుకలు జరుగుతాయని అన్నారు. ఉదయం 10. 30గం. లకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్