రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరద సహాయక చర్యల్లో పాల్గొ నేందుకు జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు మంగళవారం అర్ధరాత్రి విజయ వాడకు చేరుకొని బుధవారం వరద ముంపు ప్రాంతాల్లో పాల్గొని ప్రజలకు సేవలు అందిస్తున్నారని జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్ విజయవాడ నుంచి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ జివీఎంసీ ఉద్యోగులతో పంపిణీ చేశామన్నారు.