భారతదేశ గైనకాలజీ వైద్యశాస్త్రంలో ప్రముఖ సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ అబ్స్‌టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ‘వేవ్స్-2025’ పేరుతో ఈ నెల 17, 18 తేదీల్లో విశాఖపట్నం బీచ్ రోడ్డులోని హోటల్ రాడిసన్ బ్లూలో సదస్సు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ గైనకాలజిస్టులు, మహిళా ఆరోగ్య నిపుణులు, వైద్య విద్యార్థులు ఈ సదస్సుకు హాజరవుతారని నిర్వాహకులు మంగళవారం తెలిపారు.