విశాఖలో భారీ వర్షం

61చూసినవారు
విశాఖలో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులకు తీవ్ర గాలులు తోడయ్యాయి. దీంతో గాలివాన భీభత్సవం సృష్టిస్తోంది. పలు రహదారులపై వర్షం నీరు చేరింది. మధ్యాహ్నం వరకు ఓ మోస్తరు ఎండ కాసింది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమైంది. 5 గంటల నుంచి విశాఖలో పలు చోట్ల భారీ వర్షం ప్రారంభమైంది. పలు చోట్ల ముందస్తు జాగత్తలో భాగంగా విద్యుత్‌సరఫరా నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్