మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధ్యక్షులు జగన్ పుట్టినరోజు వేడుకలను విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అలుపన కనకరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గాజులవీధిలోని వై. యస్. రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద జగన్ జన్మదిన వేడుకలు ఆడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.