విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్బంగా డాక్టర్ కందులు నాగరాజు మాట్లాడుతూ విశాఖ నగరానికి పోలీస్ కమిషనర్ గా డైనమిక్ అధికారి వచ్చారని కొనియాడారు. సీపీ ఆధ్వర్యంలో విశాఖ మరింత ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు.