దేశానికే కేరళ వామపక్ష ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవడానికి, ప్రజా మద్దతు పొందడానికి మార్క్స్ ఎంగేల్స్ చూపిన మార్గమేనని కేరళ మాజీ మంత్రి కేకే శైలజ తెలిపారు. గురువారం విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సిపిఐఎం జిల్లా కమిటీ కేరళ వామపక్ష ప్రభుత్వం - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశం పై సెమినార్ నిర్వహించింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.