నియోజకవర్గ అభివృద్ధికి దిశానిర్దేశకంగా చేపట్టిన “నియోజకవర్గ విజన్ కార్యాచరణ” పై తొలి సమావేశం శనివారం నాడు నర్సీపట్నంలోని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజక వర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ప్రత్యేక యూనిట్‌ను అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ యూనిట్‌కు చైర్‌పర్సన్‌గా నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తారు.