విశాఖ మేయర్‌పై అవిశ్వాసం.. కూటమి నేతల భేటీ

53చూసినవారు
విశాఖ మేయర్‌పై అవిశ్వాసం.. కూటమి నేతల భేటీ
విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు దసపల్లా హోటల్‌ ఆదివారం భేటీ అయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాస్‌, ఎం పి శ్రీ ఎం. శ్రీ భరత్ , ఎమ్మెల్యే లు వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్ రాజు, కొణతాల రామకృష్ణ , వంశీ కృష్ణ శ్రీనివాస్, శ్రీ గంటా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్ చేజిక్కించు కోవటం కోసం జరిగే ఎన్నిక పై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్‌పై పెట్టే అవిశ్వాసంపై కూటవి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్