విశాఖ జీవీఎంసీలో ఆస్తిపన్ను, చెత్త పై విధించిన యూజర్ చార్జీలు రద్దును కోరుతూ మేయర్ హరివెంకట కుమారికి జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గురువారం వినతిపత్రం అందజేశారు. 10న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాటిని అజెండా అంశాలుగా చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ అంశాలు అజెండాలో పొందుపరుస్తామన్నారు.