పోర్ట్ ఏరియాలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ స్వామి వారి తెప్పోత్సవం కనుల పండుగగా సాగింది. ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై తెప్పోత్సవం ప్రారంభించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ సమాకూర్చిన లాంచీలోశ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామివారిని వెంచేయించి సాగర జలాల్లో ఊరేగించారు. అంతకుముందు స్వామివారిని మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.