విశాఖ వాసులకు అలర్ట్. జీవీఎంసీ పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని మేయర్, కమిషనర్ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. వీటిని వాడేవారిపై జరిమానా విధించడంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రజలకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.