విశాఖ జిల్లా రుషికొండలో వైసీపీ నిర్మించిన ప్యాలెస్‌లోకి ఆదివారం టీడీపీ నేతలు అడుగుపెట్టారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రుషికొండను ధ్వంసం చేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇన్నాళ్లకు మళ్లీ రుషికొండలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని టీడీపీ క్యాడర్ పేర్కొంది.