వాతావరణం చల్లగా ఉండడం. పైగా వీకెండ్ కావడంతో విశాఖలోని సాగరతీర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆదివారం సాయంత్రం నుంచి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. కుటుంబాలతో సహా తరలివచ్చి ఎంజాయ్ చేశారు. విశాఖ ఆర్కే బీచ్ మొదలు రుషికొండ బీచ్ వరకూ సందడి నెలకుంది. భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పర్యాటకులు సారగతీర అలల మధ్య ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.