చెత్తపై యూజర్ చార్జీలు రద్దు చేయాలి

62చూసినవారు
చెత్తపై యూజర్ చార్జీలు రద్దు చేయాలి
జీవీఎంసీ పరిధిలో చెత్తపై యూజర్ చార్జీలు రద్దు చేయాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగర మేయర్ హరి వెంకట కుమారికి బుధవారం వినతిపత్రం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆస్తి విలువ ఆధారిత పన్నురద్దు చేయాలన్నారు. ఈనెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ సమావేశంలో ఈ అంశాలను అజెండాలో చేర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్