విశాఖ: పలు అభివృద్ధి పనులకు ఆమోదం

76చూసినవారు
విశాఖ: పలు అభివృద్ధి పనులకు ఆమోదం
విశాఖ జివిఎంసి పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయీ సంఘం ఆమోదం తెలిపిందని స్థాయీ సంఘం చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని స్థాయీ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 117 అంశాలను పొందుపరిచారని, వాటిని స్థాయీ సంఘం సభ్యులు చర్చించిన పిదప 4 అంశాలు వాయిదా వేయడమైనదని, మిగిలిన 113 అంశాలు ఆమోదం పొందాయన్నారు.

సంబంధిత పోస్ట్