నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిలో మీటర్లు నాగపట్నానికి 320, పుదుచ్చేరికి 410, చెన్నైకి 490, కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇది ఉత్తర-వాయువ్య దిశగా పయనమవుతుందని తెలిపారు.