మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోగల వార్డు కార్యదర్శులు చేపడుతున్న విధుల నిర్వహణలో సమన్వయంతో సమిష్టి కృషితో భాద్యతగా విధులు నిర్వహించాలని విశాఖ నగర ప్రజలకు అందిస్తున్న సేవలలో చిత్తశుద్ధిని కనబరచాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ 4వ జోన్ అభివృద్ధి, ప్రజల సమస్యలపై జోన్-4 సూర్యాబాగ్ సమావేశ మందిరంలో జోనల్ స్థాయి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.