సింహాచలంలో సింహాద్రి అప్పన్న భక్తులకు శనివారం పెను ప్రమాదం తప్పింది. తొలిపావంచా వద్ద గిరిప్రదక్షిణకు రేకుల షెడ్డు నిర్మించారు. అయితే ప్రమాదవశాత్తు ఆ రేకుల షెడ్డు శనివారం కూలిపోయింది. ఆ సమయంలో షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.