విశాఖలోని సింహాద్రి అప్పన్న భక్తులకు ప్రమాదం తప్పింది. తొలిపావాంచా వద్ద గిరి ప్రదక్షిణకు వేసిన రేకుల షెడ్డు శనివారం కూలిపోయింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలింది. అయితే షెడ్డు క్రింద ఎవరు లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇటీవల చందన యాత్ర సందర్బంగా గోడ కూలిన ఘటన తరువాత కొండ దిగువున షెడ్డు కూలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.