విశాఖ: పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌

6చూసినవారు
విశాఖ: పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌
విశాఖలోని గాంధీగ్రామ్‌లోని పశువుల ఆసుపత్రి లో డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువుల ద్వారా రేబిస్ వంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెంపుడు జంతువుల యజమానులు తమ జంతువులకు తప్పనిసరిగా రేబిస్ వ్యాక్సినేషన్ చేయించాలన్నారు.