విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి, వెస్ట్ ఏసీపీ పృథ్వితేజల సూచనలతో గోపాలపట్నం పోలీసులు ఆదివారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గోపాలపట్నం సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు వి. అప్పలనాయుడు, సిహెచ్. రామారావు తదితరులు ఇందిరానగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం బాటిళ్లను సీజ్ చేయడంతో పాటు, ఇద్దరిపై కేసు నమోదు చేశారు.