విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతగా ఉన్న బెహరా భాస్కరరావు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నేరుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణతో భేటీ అయ్యారు. దీంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాతే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో త్వరలో చేరనున్నారు.