బ్రిటీష్ కాలం నుంచి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మార్చి కేంద్ర బిజెపి ప్రభుత్వం 4 లేబర్ కోడ్‌లు తెచ్చిందనీ, ఇందువల్ల కార్మికుల ప్రాథమిక హక్కులైన సంఘం పెట్టడం, సమ్మెలు చేయడంతో సహా అనేక హక్కులు కోల్పోతున్నారనీ సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. యం. శ్రీనివాస్ అన్నారు. ఆ లేబర్ కోడ్ల్ రద్దుచేయాలని 9న జరిగే దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని శనివారం నగరంలో వివిధ ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు