బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన విశాఖకు చెందిన మాధవ్ అభినందన సభ శనివారం సాయంత్రం ఐదు గంటలకు అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో నిర్వహించనున్నట్టు పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి బిజెపి విశాఖ శ్రేణులతో పాటు అభిమానులు భారీగా తరలి రానున్నట్లు పేర్కొంది.