తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంచండి అని ఏపీ స్టేట్ టెలికం విభాగం విశ్రాంత అధికారి కేఎం రావు పిలుపునిచ్చారు. శనివారం విశాఖలోని ఉషోదయ జంక్షన్ లోని పెదవాల్తేరు జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో క్లైమేట్ టీం ఎన్జీవో నేతృత్వంలో మొక్కలు నాటిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కర్బన ఉద్గారాలు తగ్గించండి అని కోరారు. చెట్లను కాపాడండి ప్రాణవాయువుని పెంపొందించండి అని పిలుపునిచ్చారు.