జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని వన్ టౌన్ లోని స్వామి వివేకానంద సంస్థ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ విచ్చేసి కంటి శిబిరం ప్రారంభించారు. దాదాపు 200 మంది హాజరుకాగా 44 మంది ఆపరేషన్ నిమిత్తం ఎన్నికయ్యారు. అనంతరం అనాధాశ్రమంలో వృద్ధులను పరామర్శించి, వారికి వస్త్రదానం చేశారు.