అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా విశాఖపట్నం అగ్ని మాపక కేంద్రంలో అగ్నిప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. ప్రజలకి అవగాహన కల్పించే ఉద్దేశంతో సోమవారం సూర్య బాగ్ లో గల అగ్నిమాపక కేంద్రంలో జిల్లా అగ్ని మాపక అధికారి రేణుకయ్య అగ్ని మాపక వాహనాలు జెండా ఊపి ఊరేగింపు ప్రారంభించారు. జిల్లాలో నాలుగు అగ్నిమాపక కేంద్రాల్లో వారోత్సవాలు ప్రారంభించారు.