అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఆదివారం బాణసంచా పేలుళ్లలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దర్ని సోమవారం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయ తెలిసిందే. మరికొంతమంది బాధితులు ఆయా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.