విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో తెలుగు నాటక డిజిటల్ గ్రంథాలయాన్ని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆదివారం ప్రారంభించారు. ఈ గ్రంథాలయంలో దివంగత బాదంగీర్ సాయి గ్రంథాలయం నుంచి 10 వేల నాటక పుస్తకాలను చేర్చారు. బెంగళూరులోని మనసు ఫౌండేషన్ ఈ రూపాంతరణను నిర్వహించింది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.