విశాఖలోని 39వ వార్డుకు చెందిన 12 ఏళ్ల రెహానా భాషా స్కూల్ ఫీజు కోసం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 5, 000 ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆసిల్‌మెట్టలోని తన కార్యాలయంలో శనివారం వాసుపల్లి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకంలో లక్ష మందికి పైగా అనర్హులను చేసి హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.