విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గంగాదేవి అమ్మవారిని మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఫిషింగ్ హార్బర్, ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం, వైశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గంగాదేవి వేడుకలకు ఆహ్వానించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులు గంగాదేవిని తమ కులదైవంగా కొలుస్తారని పేర్కొన్నారు.