విశాఖ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 236 అర్జీలు

66చూసినవారు
విశాఖ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 236 అర్జీలు
విశాఖ కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వినతి పత్రాలను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్వీకరించారు. మొత్తం 236 వినతులను స్వీకరించినట్లు ఆయన చెప్పారు. వీటిలో జీవీఎంసీ విభాగానికి 39, రెవెన్యూ విభాగానికి 101, పోలీస్ శాఖకు సంబంధించి 23, ఇతర విభాగాలకు సంబంధించి 73 ఉన్నాయని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్