భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని సోమవారం విశాఖలో వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఎల్ ఐ సి భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు స్టాలిన్, జిల్లా కార్యదర్శి పైడిరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు తెలిపారు.