విశాఖ:: బాలలను కాపాడుకుందాం

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జయప్రదం చేయాలని విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం జీవీఎంసీలోని తన చాంబర్‌లో స్వాంతన స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకొచ్చిన బాల కార్మిక వ్యతిరేక పోస్టర్‌లను ఆయన ఆవిష్కరించారు.