పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన ముగించుకొని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. నేరుగా విశాఖలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కూడా వినతులు స్వీకరిస్తారు.