విశాఖలోని పాతనగరంలో శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలలో భాగంగా ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన స్వామి వారు శేష పాన్పుపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి, సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం 1400 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం బి. మౌనిక ఆధ్వర్యంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి.