విశాఖపట్నంలో పని చేస్తున్న జర్నలిస్టులకు త్వరలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బుధవారం కలెక్టర్‌ను కలిసి తమ 12 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈనెల 21న యోగాంధ్ర కార్యక్రమం తర్వాత వైద్య పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.