విశాఖ: చికిత్స పొందుతూ ఒకరు మృతి

61చూసినవారు
విశాఖ: చికిత్స పొందుతూ ఒకరు మృతి
అనకాపల్లిలోని గవర వీధికి చెందిన కర్రి లక్ష్మణరావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్వారకానగర్ లోని ఓ దుకాణంలో పని చేసే ఇతను గత నెల 18న ఎండాడ నుంచి ఆటోలో విశాఖ వస్తుండగా వెంకోజీపాలెం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దింతో లక్ష్మణ రావుకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్