విశాఖ జీవీఎంసీ ప్రధాన ఇంజనీరుగా జి. వి. పల్లంరాజు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మే 31వ తేదీన జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ గా ఉన్న పి. శివప్రసాదరాజు ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న జి. వి. పల్లంరాజు ను పూర్తి అదనపు బాధ్యతలతో ప్రభుత్వం నియమించింది.