విశాఖలోని వన్ టౌన్‌లోని కన్యకా పరమేశ్వరి ఆలయానికి అతి సమీపంలో కొత్తగా ప్రారంభమైన వైన్ షాపును వ్యతిరేకిస్తూ శనివారం రాత్రి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆలయం పక్కనే వైన్ షాపు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపు వల్ల ఆలయ పవిత్రత దెబ్బతింటుందని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఆలయానికి రావడానికి ఇబ్బందులు పడతారని ఆందోళనకారులు పేర్కొన్నారు.