విశాఖ నగర సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులుగా డి. రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో విశాఖలోని ఎస్. ఐ. సి. ఏడీగా విచ్చేసిన ఆయన విశాఖపట్టణం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉప సంచాలకులుగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ లను వారి ఛాంబర్లలో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.