ముస్లిం శ్మశాన వాటికలకు మరమ్మతులు చేపట్టాలని నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రతి నియోజకవర్గంలో షాది ఖానా ఏర్పాటు చేయాలని కోరారు. ముస్లిం విద్యార్థులకు ఉర్దూ పాఠశాలలు మంజూరు చేయాలని వినతిపత్రంలో సంఘం ప్రతినిధులు షేక్ నాగూర్, షేక్ రహిమాన్ కోరారు.