ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది కాలం పూర్తి అయిందని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పరిపాలన చేస్తుందని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా బిజెపి, జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్లు, పలువురు కార్పొరేటర్లతో కలసి కేక్ ను కట్ చేశారు.