రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని, సత్ఫలితాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై బుధవారం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.