విశాఖ: కొమ్మినేని వ్యాఖ్యలపై టీడీపీ ఆందోళన

85చూసినవారు
విశాఖ: కొమ్మినేని వ్యాఖ్యలపై టీడీపీ ఆందోళన
కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖలోని తెలుగుదేశం పార్టీ మహిళలు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి మీడియాను రద్దు చేయాలని, జగన్ తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో తెలుగు మహిళా నాయకురాళ్లు ఈతలపాక సుజాత, సర్వసిద్ధి అనంతలక్ష్మి, గనగల్ల సత్య, దవల విజయ్ కుమార్, అవ్వకాంతం, హారతి, బుచ్చ రామురెడ్డి, డాక్టర్ చక్రవర్తి విల్లూరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్